|
|
TeluguOne Rating | ||
2.25 /5 | ||
Release Date | ||
24-04-2009 | ||
Story | ||
ప్రభుత్వ పాఠశాలలో, స్కూల్ చదువు పూర్తిచేసి, కాలేజీకి వెళ్ళిన ముత్తు, రమేష్, కామాక్షి, కవిత, ఆదిలక్ష్మి, సహానా అనేవిద్యార్థినీ, విద్యార్థుల కథ. వీరిలో దాదాపు అందరూ పేదవారే. వారి మధ్యకు శోభన (తమన్నా) అనే ఒక అందమైన అమ్మాయి బెంగుళూరు నుండి వచ్చి చేరుతుంది.ఆమె తల్లి మరణించి ఉన్న బాధలో ఆమె ఉండటంతో ఆమె వీరెవరితో కలవదు. ఆమెను సీనియర్స్ ర్యాగింగ్ చేస్తుంటే ముత్తు అండ్ గ్యాంగ్ ఆమెను కాపాడతారు. ముత్తు తండ్రి రాళ్ళు కొట్టే కూలీ. ముత్తు చెల్లి కూడా చదువు మానేసి తానూ రాళ్ళు కొడుతుంది. ముత్తు మంచి స్పోర్ట్స్ మేన్. అతనికి ఆ కోటాలో ఉద్యోగం వస్తుందని అతను చదువుతుంటాడు. శోభనను చూస్తూ ఆమె వైపు ఆకర్షితుడవుతుంటాడు ముత్తు. శోభన పరిస్థితి కూడా అలానే ఉంటుంది. కానీ కవిత చెప్పిన మాటల వల్ల వీళ్ళిద్దరూ తమ తమ హద్దుల్లో ఉంటారు. శోభన తనకు దూరమవుతుందనే బాధతో ముత్తు ప్రాక్టీస్‌కి వెళ్ళడు. కానీ శోభన చెప్పిన మాటల వల్ల అతను ఆటల పోటీలకు వెళ్ళి గెలుస్తాడు. ఆ తర్వాత ఇంటర్ కాలేజ్ పోటీలకు వెళ్ళిన వీళ్ళంతా ఒక చిన్న గొడవ వల్ల డిస్ట్రబ్ అవుతారు. కాలేజీ వారు ఏర్పాటుచేసిన ఎడ్యుకేషనల్ టూర్‌కి బయలుదేరతారు. అక్కడ నుండి తిరిగి వస్తూండగా, హోటల్లో వెజిటేరియన్ ఆహారం దొరకనందువల్ల, అక్కడికి ఒక మైలు దూరంలో ఉన్న వేరే హోటల్లో నుండి తేవటానికి ముత్తు వెళతాడు. అప్పుడు శోభన తన ప్రేమ గురించి కవితకు తెలియజేస్తుంది. ముత్తు తిరిగి వచ్చే లోపల ఏదో పార్టీ నాయకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారని, ఆ నాయకుడి అనుచరులు ఈ విద్యార్థుల బస్సుని తగులబెడతారు. ఆ బస్సులోనుంచి అందరూ బయట పడినా, శోభన, కవిత, ఆదిలక్ష్మి మాత్రం బస్సులో ఉండి కాలిపోతారు. వీళ్ళు ప్రతి సంవత్సరం ఆ రోజున అక్కడికి వచ్చి తమ స్నేహితురాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తుంటారు. క్లుప్తంగా ఇది కథ. | ||
Analysis | ||
ఇది తమిళనాడులో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా నిర్మించిన చిత్రం. ఈ చిత్రాన్ని దర్శకుడు బాలాజీ శక్తివేల్ ఉన్నంతలో ఆసక్తికరంగా మలిచాడనే చెప్పాలి. ఆయన గతంలో కూడా ఇలాంటి యదార్థ సంఘటన ఆధారంగా నిర్మించిన "ప్రేమిస్తే" చిత్రం సూపర్ హిట్టయ్యింది. ఇదే కోవకు చెందిన చిత్రమిది. సగటు భారత విద్యార్థి ఆర్థిక, సామాజిక పరిస్థితి ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. అంతే కాకుండా వారికి ఒక దిశా నిర్దేశం కూడా చేశారు.అలాగే టీనేజ్‍లో విద్యార్థినీ, విద్యార్థుల మధ్య చిగురించే ప్రేమను కూడా చూపించే ప్రయత్నం చేశారు. మొత్తానికి సినిమా అక్కడక్కడా కొంచెం స్లోగా అనిపించినా, ఓవరాల్‍గా సినిమా బాగానే ఉంటుంది. స్క్రీన్‌ప్లే ఒ.కె. టేకింగ్ పరంగా కూడా ఫరవాలేదు. | ||
DMK Perspective | ||
నటన -: తమన్నా బాగానే నటించింది. హీరో అఖిల్‍తో సహా మిగిలిన వారంతా కొత్తవారైనా అందరు బాగానే నటించారు అనేకన్నా దర్శకుడు వారి నుంచి చక్కని నటన రాబట్టుకున్నారనటం బెటర్. సంగీతం -: పాటల్లో "కలాయా--నిజమా '', "చూపే కదా చంద్రోదయం'', ''కవితలే కనులలో తోచేవేళ-నీజతనే చేరితే నాలో పరవశం'' పాటలు సంగీత పరంగా, సాహిత్య పరంగా కూడా బాగున్నాయి. రీ-రికార్డింగ్ బాగానే ఉంది. మాటలు -: సగటు స్థాయిలో ఉన్నాయి. కెమెరా -: సహజంగా ఉంది. ఆర్ట్స్ -: బాగుంది ఎడిటింగ్ -: బాగుంది. ఇది చూసి తీరాల్సినంత గొప్ప చిత్రమేం కాదు, అలాగని మరీ నీచమైన చిత్రం కూడా కాదు. కానీ ఇదొక విభిన్నమైన కథాంశంతో తీసిన చిత్రం. రొటీన్ చిత్రాల్లోలా యుగళ గీతాలూ, యాక్షన్ సిన్లూ, ఛేజింగ్ సీన్లూ ఈ చిత్రంలో కనపడవు. |
No comments:
Post a Comment