Tuesday, April 28, 2009

మహేష్‌తో 70 లక్షల బెడ్ రూమ్‌లో అనుష్క (Apr 28 09)

70 లక్షలకు ఏకంగా ఇల్లే వస్తుంది. అలాంటిది ఎవరికైనా 70 లక్షల బెడ్ రూమ్ అవసరమా...? అంటే అవసరమేనంటున్నాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ప్రిన్స్ మహేష్ బాబు, అనుష్క జంటగా నటిస్తున్న "వరుడు'' చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో 70 లక్షల రూపాయల ఖర్చుతో ఒక భారి సెట్‍ వేశారు.ఈ బేడ్ రూమ్‌లో హీరో మహేష్ బాబు, హీరోయిన్ అనుష్కలపై కొన్ని ముఖ్యమైన సీన్లు తీశారట. అన్నట్టు ఈ చిత్రంలో మహేష్ బాబు ఒక క్యాబ్‍ డ్రైవర్‌గా నటిస్తున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిన సమాచారం. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్ బాబు హీరోగా నటిస్తూండగా వస్తున్న చిత్రం ఇదే కావటంతో ఈ చిత్రం కోసం మహేష్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

No comments:

Post a Comment